కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సోమవారం పలువురు అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి తన చాంబర్లో నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టి అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నేడు వేలాదిమంది కార్యకర్తలతో కలిసి ఉరేగింపుగా వెళ్లి తన నామినేషన్ సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతితులుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం హాజరయ్యారు. హుజురాబాద్ కు చెందిన చింతా అనిల్ కుమార్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నామినేషన్ పత్రాలను అందించారు. వీణవంక మండలం శ్రీరాముల పేట గ్రామానికి చెందిన దేవునూరి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆధార్ పార్టీ తరఫున లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఓ మహిళ నామినేషన్ దాఖలు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన తాళ్లపల్లి అరుణ ఆధార్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు మరో రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన బంకరాజు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన అబ్బడి బుచ్చిరెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. గట్టు రాణా ప్రతాప్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చిలువేరు శ్రీకాంత్, ధర్మ సమాజ్ పార్టీ గవ్వల లక్ష్మి ఇండిపెండెంట్ అభ్యర్థి జింక శ్రీనివాస్ ఇండిపెండెంట్ గ నామినేషన్ సమర్పించారు.
నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి..
1.వెలిచాల రాజేందర్ రావు, (కాంగ్రెస్ అభ్యర్థి) నాలుగు సెట్లు
2. చింత అనిల్ కుమార్ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా )
3. దేవునూరి శ్రీనివాస్, (ఇండిపెండెంట్)
4. బంక రాజు, (ఇండిపెండెంట్), రెండు సెట్లు
5. అబ్బడి బుచ్చిరెడ్డి, (ఇండిపెండెంట్)
6. తాళ్లపల్లి అరుణ, (ఆధార్ పార్టీ)
7. గట్టు రాణా ప్రతాప్ (సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా)
8. చిలువేరు శ్రీకాంత్, (ధర్మ సమాజ్ పార్టీ)
9. గవ్వల లక్ష్మి (ఇండిపెండెంట్ అభ్యర్థి)
10. జింక శ్రీనివాస్ (ఇండిపెండెంట్)
11. బరిగె గట్టయ్య యాదవ్ (ఇండిపెండెంట్)
12. లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, (ఎం సిపిఐ అభ్యర్థి)
13. ఎండీ జిషాన్ (ఇండిపెండెంట్ అభ్యర్థి)