అదిలాబాద్, 19 ఎప్రిల్: కొమురం భీం జిల్లా వాంకిడి మండలంలోని టోల్ ప్లాజా వద్ద ఉదయం వాహనాలు తనిఖీలు చేస్తుండగా సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 71 వేల 500 నగదును పట్టుకున్నట్లు వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర లోని గడ్చిరోలికి చెందిన గొడిసెలవార్ నరేందర్ కారులో వాహనంలో సిద్దిపేట వైపు వెళ్తుండగా అతని వద్ద నుంచి రూ. 71 వేల 500 పట్టుకున్నామన్నారు. సరైన ఆధారాలు లేని కారణంగా నగదును సీజ్ చేసి ఎఫ్.ఎస్.టి టీం కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ గంగన్న పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్సై సాగర్ తెలిపారు.
వాంకిడి టోల్ ప్లాజా చెక్ పోస్ట్ వద్ద రూ.71 వేల 500 పట్టివేత
byJanavisiontv
-
0