కరీంనగర్, 24 ఎప్రిల్: కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు బుధవారం అభ్యర్థులు, వారి తరఫున ప్రతిపాదకులు తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. 13 మంది అభ్యర్థులు, వారి తరఫున ప్రతిపాదకులు 19 సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు. ఈ మేరకు వారి నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు సతీమణి వెలిచాల రేఖ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తరఫున మంగ రామచంద్రం ఒక సెట్ నామినేషన్ వేశారు. టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తరఫున కరీంనగర్ సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్లు కనుమల్ల విజయ న్యాలకొండ అరుణ- రాఘవరెడ్డి, మున్సిపల్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కొత్తపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పిల్లి శ్రీలత- మహేష్, అక్కన్నపేట జడ్పీటీసీ భూక్యా మంగ రెండో సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. అదేవిధంగా వినోద్ కుమార్ తరఫున మూడవ సెట్ నామినేషన్ ను సుధగోని శ్రీనాథ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి వచ్చి దాఖలు చేశారు. బుధవారం కొత్తగా ఎనిమిది మంది నామినేషన్లు వేశారు. ఐదుగురు 2, 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. జంగా అపర్ణ, ఇండిపెండెంట్ అభ్యర్థి
2. వెలిచాల రేఖ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండు సెట్లు
3. గద్ద సతీష్, ఇండిపెండెంట్ అభ్యర్థి
4. అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
5. బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రెండు సెట్లు
6. శివరాత్రి శ్రీనివాస్, నాలుగు సెట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి
7. వేముల విక్రం రెడ్డి, రెండు సెట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి
8. చీకోటి వరుణ్ కుమార్ గుప్తా, తెలుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాలుగు సెట్లు
9. గౌరీశెట్టి సురేష్
ఇండిపెండెంట్ అభ్యర్థి
10. బరిగె గట్టయ్య యాదవ్,
ఇండిపెండెంట్ అభ్యర్థి రెండు సెట్లు
11. సూరం చంద్రశేఖర్, ఇండిపెండెంట్ అభ్యర్థి రెండో సెట్
12. పెద్దపల్లి శ్రావణ్, భారతీయ యువకుల దళం పార్టీ అభ్యర్థి రెండో సెట్
13. గట్టు రాణా ప్రతాప్, సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రెండో సెట్