మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన పోలింగ్.

కాంగ్రెస్ నుండి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సహా మొత్తం 1439 మంది ఓటర్లు కాగా 888 మంది ఎంపీటీసీ, 83 మంది జెడ్పీటీసీ, 449 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటింగులో పాల్గొననున్నారు.

ఏప్రిల్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Post a Comment

Previous Post Next Post