న్యూ ఢిల్లీ, మార్చి 16: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడు దలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ షెడ్యూల్ ఎట్టకేలకు ఎన్ని కల కమిషన్ విడుదల చేసింది. అయితే దేశంలో మొత్తం ఐదు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, లోక్‌సభ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా జరుగను న్నాయి. 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. అయితే ఇందులో జమ్మూ లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగ నున్నాయి. అయితే లోక్‌సభ గడువు జూన్ 16తో ముగియనుంది. ఇక తెలంగాణ విషయా నికొస్తే రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరుగనున్నాయి. తెలంగాణలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశం ప్రకటించారు. అయితే ఏపీ, తెలంగాణలో ఒకే సారి ఎన్నికలు జరుగ నున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశవ్యా ప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది. ఎన్నికలకు కోటి 50 లక్షల సిబ్బంది.
ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల సిబ్బంది ఉండను న్నట్లు రాజీవ్ తెలిపారు. జూన్ 16వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.