రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు..

నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు..

నేడు ఐదుగురు పార్టీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించునున్నారు. ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, సంజీవపురం గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో చేనేత మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించున్నారు. రాప్తాడు నియోజకవర్గం, రామ్ గిరి మండలం, పోలెపల్లి గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని.. పెనుకొండ నియోజకవర్గం, దర్గా ప్రాంతంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Post a Comment

Previous Post Next Post