కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం విద్యార్థిని మృతి

కరీంనగర్ జిల్లా:ఫిబ్రవరి 19
కరీంనగర్ లోని బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొని 19 సంవత్సరాల దియా పటేల్ అనే విద్యార్థిని ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.

గుజరాత్ నుంచి వచ్చి కొద్ది సంవత్సరాల నుండి గోపాల్ పూర్ లో నివాసం ఉంటు న్నారు తండ్రి రాజీవ్ పటేల్.

మృతురాలు దియా పటేల్ ఆల్ ఫోర్స్ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.

కరీంనగర్ ఫ్లైఓవర్ కింద సర్కిల్ నుండి ఎలక్ట్రానిక్ స్కూటీపై బైపాస్ కి మలుపు తిరుగుతుండగా గోదావరి ఖని నుండి హైదరాబాద్ వెళుతున్న చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Post a Comment

Previous Post Next Post