సమ్మక్క సారలమ్మ ను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

ములుగు జిల్లా: ఫిబ్రవరి 23: మేడారం మహాజాతరలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఈరోజు పాల్గొన్నారు.

ఇవాళ మేడార జాతరకు వెళ్లిన గవర్నర్ సమ్మక్క- సారలమ్మను దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా వనదేవతలకు స్వర్ణం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

గ‌వ‌ర్న‌ర్ తో పాటు కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకు న్నారు.అంత‌కు ముందు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, గవర్నర్ తమిళిసై శుక్రవారం ఉదయం హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు.

వీరికి మంత్రి సీతక్క, ఈటెల రాజేందర్, జిల్లా కలెక్టర్, త్రిపాఠి ఘనస్వాగతం పలికారు. అనంతరం వనదేవతల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అక్కడ బంగారాన్ని సమర్పిం చారు.

Post a Comment

Previous Post Next Post