మేడారం: గద్దెపైకి నేడే సమ్మక్క రాక

ములుగు జిల్లా:ఫిబ్రవరి 22
డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి బుధవారం చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది.

సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం ఉదయం ఆమె వెలసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భాటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి.. ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం ఏడుగంటల దాకా ప్రత్యేక పూజలు చేశారు.

సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన పూజారి సారయ్య.. భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నెపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం దారిపొడవునా భక్తులు బారులుతీరి హారతులిచ్చారు.

రాత్రి 12.11 గంటలకు సారలమ్మ గద్దెకు చేరుకుంది. మహబూ బాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు.

అంతకుముందు పగిడి ద్దరాజు-సమ్మక్క కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దెపైకి రానుంది.

Post a Comment

Previous Post Next Post