ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో పదవ తరగతి టాలెంట్ టెస్ట్

విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకె ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్

*జిల్లా విద్యాధికారి ఎం. రమేష్ కుమార్*

*-పోరాటాలతో పాటు చదువులో రాణించాలని ఎస్ఎఫ్ఐ చేస్తున్న కృషి అభినందనీయం*

*ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 19,20 తేదీల్లో జరిగే పదవ తరగతి టాలెంట్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ*

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19, 20 తేదీల్లో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే టాలెంట్ టెస్ట్ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు, భయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు 
ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు సిరిసిల్ల నియోజకవర్గంలో 19న, వేములవాడ నియోజకవర్గ పరిధిలో 20న నిర్వహించే టాలెంట్ టెస్ట్ కరపత్రాలను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ.. నేటి అధునాతన కాలంలో విద్యార్థులు వారి మేధోశక్తిని పోటీ ప్రపంచానికి అనుగుణంగా పెంపోందుంచుకోవాలని, విజ్ఞాన వంతులుగా, మేధావులుగా తయారవ్వాలని ఆయన తెలిపారు.విద్యార్థులు పాఠ్యపుస్తకలతో పాటు,అనేక అభ్యుదయ పుస్తకాలు చదవాలని సమాజాన్ని అధ్యయనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఉద్యమాలతో పాటు విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ లు పెట్టడంతో వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం, వారి సమస్యలపై పోరాడటమే కాకుండా టాలెంట్ టెస్ట్ నిర్వహించి వారిలోని భయాన్ని తీసేసి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టెస్ట్ ను నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షకు ధీటుగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, జిల్లా స్థాయిలో మండల స్థాయిలో టాప్ ముగ్గురికి, పరిక్ష వ్రాసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక పారితోషకం, షీల్డ్స్ సర్టిఫికెట్స్ ఇస్తామని, టాలెంట్ టెస్ట్ విజయవంతం కావడానికి ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లితండ్రులు అందరు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ , కుర్ర రాకేష్ నాయకులు ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post