నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

Parliament: నేటి నుంచి ఈనెల 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

ఢిల్లీ : నేటి నుంచి ఈనెల 22 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. టీఎంసీ ఎంపీ మహువాపై ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదిక మీద చర్చ జరిగే అవకాశం ఉంది..

ఉభయసభల ముందుకు 24 బిల్లులు రానున్నాయి. ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ప్రెస్‌-పీరియాడికల్స్‌ బిల్లుపై చర్చ జరగనుంది..

ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ ప్రమేయం లేకుండా అమలు చేసే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. దేశంలో నెలకొన్న పలు సమస్యలపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. సమావేశాలపై 5 రాష్ట్రాల ఫలితాల ప్రభావం ఉండనుంది.

Post a Comment

Previous Post Next Post