నామినేషన్ల తిరస్కరణ..

హైదరాబాద్:నవంబర్ 14
తెలంగాణలో ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ప్రధాన ప్రక్రియ అయిన నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ క్రమంలో 13 నుంచి నామినేషన్లను పరిశీలను ఈసీ ప్రారంభించింది.

కాగా ఒక్క సోమవారమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 205 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. హైదరాబాద్‌లోని పరిధిలోని 15 నియోజక వర్గాలకు సబంధించిన నామినేషన్లను పరిశీలించగా.. 332 మంది అర్హత సాధించారు.

అలాగే సరైన పత్రాలు లేని 103 నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు.పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లో నలుగురు అభ్యర్థులను తిరస్కరించారు.రంగారెడ్డిలోని 8 నియోజకవర్గాల్లో 249 నామినేషన్లు అర్హత సాధించగా.. 31 నామినేషన్లను రిజెక్ట్ చేశారు.

అలాగే మేడ్చల్ పరిధిలో 190 నామినేషన్లకు అనుమతి లభించగా.. మరో 71 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్ సైట్లో ఉంచినట్లు ఈసీ అధికారులు తెలిపారు...

Post a Comment

Previous Post Next Post