దిల్లీ మంత్రి రాజ్‌కుమార్ నివాసంలో ఈడీ సోదాలు
దిల్లీ: ఆప్ చీఫ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)సమన్లు జారీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే.. ఆ పార్టీకే చెందిన మరో నేత నివాసంలో కూడా సోదాలు చేపట్టింది..
దిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ (Raaj Kumar Anand)ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఈడీ ప్రస్తుతం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం తెల్లవారుజామునే అధికారులు మంత్రి ఇంటికి చేరుకొని సోదాలు మొదలుపెట్టారు.
రాజ్‌కుమార్ ఆనంద్ దిల్లీ సాంఘిక సంక్షేమశాఖా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంతో దిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణలో భాగంగా నేడు ఆయన ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. గతంలోనూ ఆయనను సీబీఐ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే..