బ్రిటీష్‌ ప్రధానికి దీపావళి కానుక..

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షతా మూర్తిని కలుసుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు..

అనంతరం రిషి సునాక్‌కు వినాయకుని విగ్రహాన్ని, భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు..

జై శంకర్‌ తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌ ఖాతాలో .. 'భారతదేశం- యూకేలు ప్రస్తుతం సంబంధాలను బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అందుకు ఇందుకు సహకారం అందిస్తున్న సునాక్‌కు ధన్యవాదాలు. వారి సాదర స్వాగతం, ఆతిథ్యం అద్భుతం" అని పేర్కొన్నారు. బ్రిటిష్ పీఎం రిషి సునక్ కూడా తన భావాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

Post a Comment

Previous Post Next Post