* మంగళవారిపేట గ్రామం నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచింది: దొంతి మాధవరెడ్డి
* మంగళవారిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం..
* మంగళవారి పేట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
ఖానాపూర్ మండలంలోని మంగళవారిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన వారు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి సాదరంగా ఆహ్వానించి దొంతి మాధవరెడ్డి
శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.