నేడు భైంసా, ఆర్మూర్, కోరుట్లలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళ్తోంది. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు రోడ్ షోలు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇలా ముగ్గురు గులాబీ ముఖ్య నేతలు ప్రచారంలో తమ జోష్ చూపిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రజాఆశీర్వాద సభలకు హాజరవనున్నారు. మొదటగా నిర్మల్ జిల్లాలోని భైంసాలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ మూడు సభల అనంతరం కేసీఆర్ తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యంగా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు
ఆగమవుతాయని నొక్కివక్కానించి చెబుతున్నారు.

Post a Comment

Previous Post Next Post