తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా ?

Input Editor Dayanand Jana
హైదరాబాద్‌,13 అక్టోబర్(జనవిజన్ న్యూస్):
 తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులపై అలెర్ట్ అయింది. ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్9వ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు భారీగా నగదు పట్టుకున్నారు. దాదాపు 20, నుండి 25కోట్లకు పైగా సీజ్ చేశారు.

షెడ్యూల్ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు పట్టుబడటంతో ప్రత్యేక నిఘా పెట్టింది.

ఎన్నికల నాటికీ డబ్బు పంపిణీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో వంద బలగాలను తెలంగాణ రాష్ట్రానికి సీఈసీ పంపించింది.

Post a Comment

Previous Post Next Post