తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Input Editor Dayanand Jana
తిరుపతి,13 అక్టోబర్(జనవిజన్ న్యూస్):
తిరుమల లో శుక్రవారం  శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

గురువారం స్వామివారిని 65,937 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

కాగా.. రేపు, ఎల్లుండి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. నేటి నుంచి 9 రోజుల పాటు తిరుమలలో నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.

పెరటాసి మాసం, దసరా సెలవులు నేపథ్యంలో.. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న సా.6.30కు శ్రీవారి గరుడోత్సవాన్ని నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈనెల 14 నుంచి 23వ తేదీ వరకు.. పలు సేవలు, ప్రత్యేక దర్శనాలు టీటీడీ రద్దు చేసింది..
తిరుమల లో శుక్రవారం శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

గురువారం స్వామివారిని 65,937 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

కాగా.. రేపు, ఎల్లుండి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. నేటి నుంచి 9 రోజుల పాటు తిరుమలలో నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.

పెరటాసి మాసం, దసరా సెలవులు నేపథ్యంలో.. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న సా.6.30కు శ్రీవారి గరుడోత్సవాన్ని నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈనెల 14 నుంచి 23వ తేదీ వరకు.. పలు సేవలు, ప్రత్యేక దర్శనాలు టీటీడీ రద్దు చేసింది.

Post a Comment

Previous Post Next Post