ఏపీ స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

AP: స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు.

అనారోగ్య కారణాలతో బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.

చంద్రబాబుకు వచ్చే నెల 24వ తేదీ వరకు బెయిల్‌.

నవంబర్ 10న చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై విచారణ 

వాదనలు వినిపించడానికి మరింత సమయం కావాలని కోరిన ప్రభుత్వ న్యాయవాదులు 

తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు విడుదలయ్యే అవకాశం.

జైలు వద్దకు చేరుకున్న నారా లోకేష్ దంపతులు.

కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్.

బెయిల్ సందర్భంగా చంద్రబాబుకు షరతులు

రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.

కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు.

అనారోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ కాబట్టి ఇల్లు, ఆస్పత్రికి మాత్రమే పరిమితం కావాలి.

జెడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో కేంద్రం నిబంధనలు అమలు.

Post a Comment

Previous Post Next Post