ఈడెన్ గార్డెన్ వేదికగా విరాట్ కోహ్లీ జన్మదిన వేడుకలు

కోల్‌కతా:అక్టోబర్ 31
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త రికార్డుల రారాజు, టీమిండియా కు అలుపెరుగని సారధి విరాట్ కోహ్లీ స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో తనదైన శైలిలో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కాగా.. నవంబర్ 5న కోహ్లీ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈసారి అతడి పుట్టిన రోజున భారత-సౌతాఫ్రికా తలపడనున్నాయి.

ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో కోహ్లీ పుట్టిన రోజును పురస్కరించుకుని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ క్లబ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

తన 35వ పుట్టిన వేడుకలు కోహ్లీకి ప్రత్యేకంగా గుర్తుండి పోయేలా ముస్తాబు చేస్తున్నారట. ఇప్పటికే కోహ్లీ కోసం ప్రత్యేకంగా కేక్‌ను సిద్ధం చేస్తున్నారని స్పోర్ట్స్ టుడే వెల్లడించింది.


భారత క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ ఈ విషయాన్ని దృవీకరించినట్లు తెలిపింది....

Post a Comment

Previous Post Next Post