గుంటూరు: విశాఖపట్నం రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది..
ఏపీకి అతిత్వరలో పాలనా రాజధాని కానుంది వైజాగ్. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. అలాగే.. అక్కడ ఉన్నతాధికారులకు తాత్కాలిక వసతి కేటాయింపులపై అధికారులతో సీఎం జగన్ ఇవాళ్టి సమీక్షలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్ కమిటీ, ఆయనకు సమర్పించనుంది..
Tags
Amaravathi