కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 27
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో మరో ఇద్దరు తెలుగు అధికారులు రాజకీయాలకు బలయ్యారు.
కరీంనగర్ కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు లను శుక్రవారం బదిలీ చేస్తూ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
బిజెపి నాయకుల ఫిర్యాదు మేరకు బదిలీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పలువురు సిపి, ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేయగా తాజాగా మరో ఐఏఎస్, ఐపీఎస్ లపై బదిలీ వేటు వేశారు.
తక్షణమే విధులనుండి రిలీవై ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వు లో పేర్కొన్నారు..