హైదరాబాద్,10 అక్టోబర్(జనవిజన్ న్యూస్): మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని మంగళవారం కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
Tags
తెలంగాణ