ప్రభుత్వ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..


Posted by Input Editor Dayanand Jana
అమరావతి,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్న సందర్భాల్లో వయోపరిమితి పెంచుకుంటూ వస్తోంది.

గరిష్ట వయసు దాటిపోయిన నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు వయోపరిమితిని పెంచుతూ జీవో లు జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు పలు బోర్డుల ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. యూనిఫామ్,నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు కేటగిరీలుగా గరిష్ట వయోపరిమితి ఉంది.

తాజాగా యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి ని ప్రస్తుతం ఉన్న దానికి రెండేళ్లు అదనంగా పెంచింది.ఇక నాన్ యూనిఫామ్ అభ్యర్థుల కి జనరల్ కెటగిరీకి ఉన్న 34 ఏళ్ల గరిష్ట వయసును 42 ఏళ్లకు పెంచింది.దీంతో పాటు రిజర్వ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం ఉండే అదనపు వయోపరిమితి కూడా వర్తిస్తుంది… వచ్చే యేడాది సెప్టెంబర్ 30 వ తేదీ వరకూ నిర్వహించే అన్ని ఉద్యోగాల భర్తీకి ఈ నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.త్వరలో గ్రూపు 1,గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడనుంది.

Post a Comment

Previous Post Next Post