నేటితో ముగియనున్న డీఎస్సీ దరఖాస్తు గడువు

హైదరాబాద్, నేటితో డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు శనివారం సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు. 1.71,564 మంది అభ్యర్థులు కాగా, పరీక్ష ఫీజు చెల్లించి నవారు 1,76,599 మంది ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. డీఎస్సీ నోటిఫి కేషన్లో భాగంగా మొత్తం 5089 పోస్టుల భర్తీకుగానూ సెప్టెంబర్ 20 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొదట ఈనెల 21ని ఆఖరు తేదీగా విద్యా శాఖ నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈనెల 28వ తేదీ వరకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే పరీక్ష ఫీజు చెల్లింపుకు శుక్రవారంతో గడువు మిగియగా, దరఖాస్తు స్వీకరణకు గడువు ఈ రోజుతో ముగియ నుంది. ఈ 5089 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, పీఈటీ పోస్టులున్నాయి.

Post a Comment

Previous Post Next Post