ఉద్యమ నేతకు సిరిసిల్ల అసెంబ్లీ టికెట్.. ?

Posted by Input Editor Dayanand Jana
హైదరాబాద్‌,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన ప్రస్తుత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చొక్కాల రాముకు ఆ పార్టీ నుంచి సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం వరకు ఇరు పార్టీల్లో పనిచేస్తూ వస్తున్నారు రాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ, ఇటీవల పలు పార్టీల నేతలు చొక్కాల రాముకు తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానం అందించినా, తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ కేటాయింపు పై గురువారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post