మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యె క్యాంపు ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణలో జీవో నెంబర్ 99 ద్వారా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఈనెల 8న నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ఎదుట నిరసన కార్యక్రమాలకు మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. రోస్టర్ విధానం అమలు సక్రమంగా జరగడం లేదంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి జీవో నెంబర్ 99 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ మాల మహానాడు ఇన్చార్జిగా బత్తుల కమలాకర్ ను, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జిగా ఎడ్ల రాజ్ కుమార్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు నాలుక సత్యం వెల్లడించారు. ఈనెల 8న జరిగే నిరసన కార్యక్రమాలకు మాల సామాజిక వర్గమంతా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల వద్దకు తరలివచ్చి, తమ నిరసనను తెలియజేసి, ఎమ్మెల్యేలకు వినతిపత్రం సమర్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాలుక సత్యం, రాష్ట్ర కార్యదర్శి రోడ్డ రామచంద్రం, జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ ఎడ్ల రాజకుమార్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల కమలాకర్, మాల ఐక్యవేదిక నాయకులు బండ రాజు, మంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యె క్యాంపు ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు
byJanavisiontv
-
0