లబ్ధిదారురాలికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
సిరిసిల్ల, 24 జూన్ 2025: అనారోగ్య సమస్యతో శస్త్ర చికిత్స చేయించుకుని ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారురాలికి కాంగ్రెస్ నాయకులు చెక్కు అందజేశారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూర్ ఎనిమిదవ వార్డుకు చెందిన ఆదెపెల్లి జయశ్రీ అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారురాలిని గుర్తిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వచ్చిన రూ. 28,500 విలువగల చెక్కును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు మంగళవారం లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లి అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాకం రమేష్, ఆదెపెల్లి శ్రీనివాస్, ఉలిసె లక్ష్మినారాయణ, కాసారం నరసయ్య, కాసారం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.