ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వనికించిన భూకంపం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వణికించిన భూకంపం


రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలో సోమవారం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు భూమి కంపించింది.

జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు భూమి కంపించింది. 

సుమారు ఐదు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు చిన్నపాటి కుదుపులకు గురయ్యాయి. స్వల్ప భూకంపం కారణంగానే భూమి కనిపించినట్లుగా స్పష్టమవుతుంది. 

అయితే ఈ భూకంపం తీవ్రత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లుగా సమాచారం. అయితే.. 

రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.9గా నమోదైనట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post