వేములవాడలో ట్రాఫిక్ సూచిక బోర్డుల ఏర్పాటు

వేములవాడలో ట్రాఫిక్ సూచిక బోర్డుల ఏర్పాటు

రాజన్నసిరిసిల్ల, 22 మార్చ్: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో సందడిగా ఉంటుంది. ప్రతిరోజు వాహనాల రద్దీ పెరుగుతుండటం, ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో వేములవాడ ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు చేసే క్రమంలో కీలక అంశంగా ఉన్న ట్రాఫిక్ చక్కదిద్దడం తప్పనిసరి. దీంతో వేములవాడలో ట్రాఫిక్ నియమాలను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీస్ శాఖ నడుం బిగించింది. శనివారం వేములవాడ పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించి వాహనం నడపాలంటూ, మద్యం సేవించి వాహనం నడపరాదంటూ, సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమంటూ, ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయొద్దంటూ, ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ తప్పనిసరి అనే సూచికలను ఏర్పాటు చేశారు. వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు సూచిక ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Post a Comment

Previous Post Next Post