Parents will be punished if minors drive vehicles
రాజన్నసిరిసిల్ల 22 జనవరి : విద్యార్థులు ఆడే ప్రతీ ఆటలో నియమ నిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు ఉంటాయి అన్నారు జిల్లా రవాణా శాఖ అధికారి వి లక్ష్మన్. జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవంలో బాగంగా సడక్ సురక్షా అభియాన్-జాగ్రత్తను పురస్కరించుకొని బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్ల ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామములోని జ్ఞనదీప్ హైస్కూల్ లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల గూర్చి అవగాహన కార్యక్రమము నిర్వహించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా రవాణాశాఖ సిబ్బంది జిల్లా రవాణా శాఖా అధికారి వి లక్ష్మన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆడే ప్రతీ ఆటలో నియమ నిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు ఉంటాయి అన్నారు. కార్యక్రమానికి తెలంగాణ ఇనిస్టుట్ అఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ టిఐడిఇస్ రాజన్న సిరిసిల్లా ప్రిన్సిపల్ దొరయ్ మురుగన్ పాల్గొని రహదారి భద్రత నియమాలను తెలిపారు. డ్రైవింగ్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, నియమాలు, శిక్షల గురించి తెలిపారు. యువత 18 సం.లు నిండిన తర్వాత ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొంది లైసెన్స్ తీసుకుని డ్రైవింగ్ చేయాలని సూచించారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీదర్ మాట్లాడుతూ.. పాఠశాల వాహనాల డ్రైవర్లకు బస్సు నడిపే సమయములో తప్పకుండ సహాయక వ్యక్తి ఆధ్వర్యములో బస్సు నడపాలని, తాగి డ్రైవింగ్ చేయొద్దని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడుపొద్దని సూచించారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పాఠశాల విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు డ్రైవింగ్ చేస్తే వారి తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని తెలిపారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తరువాతనే డ్రైవింగ్ నేర్చుకోవాలని సూచించారు. చదువుకునే సమయం చదువుకోసం మిగతా స్కిల్స్ మీద శ్రద్ద వహించాలన్నారు. అనంతరం పిల్లలందరికి పళ్లు పంపిణి చేశారు. భారీ ప్రమాదాలు నివారించాలంటూ 600 మంది విద్యార్థులతో పట్టణములో గొల్లపల్లి బస్టాప్ వరకు స్కౌట్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో వాహనములు నడపమని సహాయక మోటారు వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ
దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మినారాయణ, సిబ్బందికి కృతఙ్ఞతలు తెలిపారు.