సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డులో విద్యుత్ దీపాలకు వెంటనే కనెక్షన్ ఇవ్వండి : జిల్లా కలెక్టర్ ఆదేశం

విద్యుత్ దీపాలకు కనెక్షన్ ఏర్పాటు చేయాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల రెండో బైపాస్ రహదారి పరిశీలన

రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు


రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 28: సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డులోని చంద్రంపేట జంక్షన్ వద్ద విద్యుత్ దీపాలకు కనెక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.సిరిసిల్ల నుంచి కోనరావుపేట మార్గంలో చంద్రంపేట జంక్షన్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ రహదారి వెంబడి విద్యుత్ దీపాలకు వెంటనే విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సెస్ అధికారులకు సూచించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో సిరిసిల్ల మున్సిపల్ డీ.ఈ. వాణి, ఏఈ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post