సెల్ ఫోన్ కు బానిస అవుతున్న యువత..

నేటి సాంకేతిక యుగంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ సెల్‌ ఫోన్ వలయంలో చిక్కుకుపోయారు. డబ్బు లావాదేవీలతో సహా వినోదానికి, కాలక్షేపానికి ఇలా అన్ని అంశాలతో సెల్ ఫోన్ ముడి పడిపోయింది.. 

ఫోన్ అందరినీ కట్టుబానిసలుగా మార్చుకుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ తనపై ఆధారపడేలా మలుచుకుంది. యువతీ,యువకులు, విద్యార్థులైతే అరచేతిలో స్మార్ట్‌ఫోన్లను పెట్టుకొని పొద్దస్తమానం వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. 

గంటల కొద్దీ చాటింగ్‌ చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. సోషల్ మీడియాకు బానిసలైపోతున్నారు. ప్రత్యక్ష ఫ్రెండ్స్ కంటే ఆన్ లైన్ మిత్రులే ఎక్కువగా ఉంటున్నారు. మానవ సంబంధాలు తక్కువై కేవలం హాయ్.. బాయ్‌ పలకరింపులతోనే సరిపెడుతున్నారు. 

అతిగా ఫోన్‌ వాడడం, మాట్లాడడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కంటి చూపు మందగించ డమే కాకుండా జ్ఞాపక శక్తి మందగిస్తున్నది. ఇక చిన్న పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోతున్నది. రోజులో ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదని, 8 ఏళ్ల లోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వకపోవడం బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post