గోండి లిపి పండితుడు కోట్నాక్ జంగు కన్నుమూత

Sep 23, 2024,

గోండి లిపి పండితుడు కోట్నాక్ జంగు కన్నుమూత
గోండిలిపి పండితుడు కోట్నాక్ జంగు (86) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆదిలాబాద్ (D) నార్నూర్ (మ) గుంజాల గ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్వీకుల నుంచి గోండిలిపి నేర్చుకున్న ఆయన లిపికి సంబంధించిన ప్రతులు దాచారు. గోండు చిన్నారుల కోసం గోండి-తెలుగు వాచకాలను ప్రచురించి విద్యాబోధన చేశారు. 2014లో గుంజాలలో గోండిలిపి అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడంలో జంగు ప్రముఖుడు. ఆయన మృతిపై గోండు పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు.

Post a Comment

Previous Post Next Post