శ్రావణం రాకతో కళ్యాణ మండపాలకు సందడి తెచ్చింది. మూడు నెలల విరామం తర్వాత పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 16 ముహూర్తాలు ఉన్నట్లు వేదపండితులు చెబుతున్నారు.
సెప్టెంబర్ లో వివాహాలకు మళ్లీ బ్రేక్ పడనుంది. అప్పుడు అన్నప్రాసనాది ముహూర్తాలే ఉన్నాయి. సామగ్రి కొనుగోలు పెళ్లి ముహూర్తాల , చేతినిండా పని నేపథ్యంలో బంగారు, వస్త్ర, దుకాణాలు, బ్యూటీపార్లర్లు పెళ్లివారితో కిటకిటలాడనున్నాయి.
పట్టణాలు, పల్లెల్లో ఉన్న ఫంక్షన్ హళ్ళు బుకింగ్స్ తో బిజీగా ఉండనున్నాయి. ఫంక్షన్హాల్ దొరకనివారు ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో పందిరి వేసి, పెళ్లిళ్లు జరిపించనున్నారు. వేదపండితులు, బ్యాండ్ మేళా, సన్నాయి వాయిద్యాలు, టెంట్ హౌస్, పెళ్లి పందిళ్లు, క్యాటరింగ్, వంటలు చేసే వారికి, ఈవెంట్ ఆర్గనైజర్లు, కళాకారులకు ఈ నెలలో చేతినిండా పని దొరుకుతుంది.
ఈ శ్రావణ మాసంలో 16 ముహూర్తాలున్నాయి. ఈ నెల 7, 8, 9, 10, 11, 13, 14, 15, 17, 18, 19, 22, 23, 24, 26, 28వ తేదీలు పెళ్లిళ్లకు అనుకూలం. సెప్టెం బర్ లో ముహూర్తాలు లేవు.
మళ్లీ అక్టోబర్ లో ప్రారం భమై, 2025 ఏప్రిల్ వరకు ఉన్నాయి. ఉపాధికి డోకా లేదు కళాకారులు, గాయకులు, డ్యాన్సర్లు, ఆర్కెస్ట్రా వారికి మంచి రోజులుంటేనే ఉపాధి. పెళ్లిల సీజన్ మొదలు కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు ఈ నెల 9న నాగుల పంచమి, 16 న వరలక్ష్మి వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి, వంటి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి.