రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సన్నద్ధం: ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సన్నద్ధం

ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్


సిరిసిల్ల, జూన్ 1, 2024: ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో నిర్వహించబోయే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యాలయ సిబ్బంది అందరూ వేడుకలకు హాజరు కావాలని అన్నారు. వేడుకలు సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పరిశీలనలో అదనపు కలెక్టర్ వెంట పరిపాలన అధికారి రాంరెడ్డి, పర్యవేక్షకులు వేణు, తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post