తెలంగాణ అధికారిక చిహ్నంపై వివాదం ఎందుకు.. ?: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాచరికపు ఆనవాల్లు లేకుండా.. తెలంగాణ తిరుగుబాటు తత్వం, శ్రమైక జీవన విధానం, ఒక్కడి మట్టి మనుషుల పోరాటాలు, అస్థిత్వ ప్రతీకలకు ప్రతిబింబంగా..తెలంగాణ చిహ్నాన్ని ప్రజలు, ఉద్యమకారులు, మేదావులు, ప్రజా సంఘాల ఆకాంక్షల మేరకు రూపుదిద్దుకుంటుంది.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లు తెలంగాణ కు తీపి గుర్తులే. కాని చిహ్నాన్ని ఆ రెండు గుర్తులకు పరిమితం చేయడం సరికాదనే భావన ఉంది. అందుకే చిహ్నాన్ని మరింత విస్త్రుత పరుస్తుంది ప్రభుత్వం. దాంట్లో కూడా రాజకీయం ఎందుకు?
కాకతీయ కళాతోరణం, చార్మినార్ అంటే గౌరవం ఉంది. కానీ ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు? అనే చరిత్ర మనకు ఇప్పుడు కావాలి. వేటగాడి చరిత్ర ఒక్కటే చరిత్ర కాదు..గాయ పడ్డ లేడి పిల్ల చరిత్ర కూడా చదవాలి. అందుకే తెలంగాణ కీర్తి, ఆర్తి, పోరాటం, చైతన్య ప్రతికలకు చిహ్నంలో స్థానం కల్పిస్తున్నాం. అని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.