కిర్గిస్థాన్ రాజధాని బిషెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది.
బిషెక్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది.
ప్రస్తుతం కిర్గిస్థాన్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో భారత విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని తెలిపింది.
ఏదైనా సమస్య తలెత్తితే 24 గంటలు అందుబాటులో ఉండే 05557 10041 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని భారత విదేశాంగ శాఖ తెలిపింది.