తంగళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ నేతల ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు జాతీయ ఉపాధి హామీ కూలీలను ఓటు అభ్యర్థించారు. తంగళ్ళపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో మాజీ ఎంపిటిసి సభ్యుడు బైరినేని రాము ప్రచారం చేశారు. స్థానిక నాయకులతో కలిసి ఉపాధి హామీ కూలీలతో కొద్ది సేపు పని చేసి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కాంక్షిస్తూ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో చిన్నలింగాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గుర్రం రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ డెరైక్టర్ మంద నారాయణ, సీనియర్ నాయకుడు శ్రీరాముల వెంకటేష్, యూత్ అధ్యక్షులు బోలవెనీ అనిల్, భాను, రాజు, చరణ్, పర్శరములు, కొమురయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post