పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం..
పోలింగ్ అధికారుల థర్డ్ రాండమైజేషన్ పూర్తి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా పర్యవేక్షణ
మే 13న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల వారీగా పోలింగ్ అధికారుల థర్డ్ రాండమైజేషన్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్, ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా పర్యవేక్షించారు. రాండమైజేషన్ ప్రక్రియ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ చొప్పదండి, మానకొండూర్, హుజురాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాల వారీగా పీవోలు, ఏపీవోలు, ఓపీఓలను పోలింగ్ స్టేషన్లకు కేటాయించామని పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి 395 పోలింగ్ స్టేషన్లకు 1804 మంది, చొప్పదండిలో 327 పోలింగ్ స్టేషన్లకు 1528 మంది, మానకొండూర్ లో 316 పోలింగ్ స్టేషన్లకు 1472 మంది, హుజురాబాద్ లో 305 పోలింగ్ స్టేషన్లకు 1404 మంది పీఓలు, ఏపీవోలు, ఓపివోలను అలాట్ చేశామని తెలిపారు. అలాగే సిరిసిల్లలో 287 పోలింగ్ స్టేషన్లకు 1376 మంది, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి 260 పోలింగ్ స్టేషన్లకు 1232 మంది పీవోలు, ఏపీవోలు, ఓపీఓలను కేటాయించామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం ఆరు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 8816 మంది పీఓలు ఏపీవోలు, ఓపీవోలు విధులు నిర్వర్తించనున్నారని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, పూజారి గౌతమి, సిపిఓ కొమురయ్య, కలెక్టరేట్ ఏవో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.