విశ్వనాథ స్వామి ఆలయ ఖాళీ స్థలం వేలం..

సిరిసిల్ల, 15 ఏప్రిల్ (జనవిజన్ న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయం పక్కన గల విశ్వనాథ స్వామి దేవస్థానంకు చెందిన ఖాళీ స్థలాన్ని దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బహిరంగ వేలం కార్యక్రమం నిర్వహించారు. సోమవారం విశ్వనాథ స్వామి ఆలయ ఆవరణలో జరిగిన ఈ బహిరంగ వేలం కార్యక్రమానికి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. ఆలయానికి చెందిన సర్వే నెంబర్ 1563 విస్తీర్ణం 22 గుంటలు ఖాళీ స్థలంను షీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం  నిర్వహించగా నెలకు రూ. 13,600లకు విక్రమ్  హెచ్చు పాట పాడి వేలంను పొందినట్లు అధికారులు తెలిపారు. గత హెచ్చు పాట రూ. 12,000 కంటే ఈ సంవత్సరం నెలకు 1600 అదనంగా వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మారుతీ రావు, ఎండోమెంట్ ఉద్యోగులు ప్రభాకర్, రవి, రాకేశ్, ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post