పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ

పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పద్మశాలి అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కొరకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిపుణులైన పద్మశాలి అధ్యాపక బృందంచే 45 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. పదవ తరగతి పరీక్షకు హాజరై లేదా ఉత్తీర్ణులై, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న పద్మశాలి విద్యార్థులు అర్హులని అన్నారు. కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు తేది 14-04-2024 ఆదివారం నుండి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దూస రఘుపతి, గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం, కనుకుంట్ల పున్నo చందర్, మామిడాల భూపతి లు కోర్స్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వివరాలకు వాసాల హరిప్రసాద్ 9866228784, అన్నల్ దాస్ అజయ్ 9493111334 లను సంప్రదించగలరని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వాసాల హరిప్రసాద్, బొల్లి భగవాన్, బూర భాస్కర్, బైరీ రవీందర్, గుండెల్లి రవీందర్, అడేపు వేణు, కొడం రాంప్రసాద్, కనుకుంట్ల మధు, గడ్డం సత్యం లు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post