గంభీరావుపేట్, ఏప్రిల్ 5 (జనవిజన్ న్యూస్ ప్రతినిధి): రైతుల సౌకర్యార్థం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గాండ్ల రాజం, సీఈఓ జోగు రాజయ్య, డైరెక్టర్ పాతూరి బాల్రెడ్డి, మేకల యశోద, నారాయణ, సెంటర్ ఇంచార్జ్ పాతూరు బాల్ రెడ్డి, హమాలి సంఘం అధ్యక్షులు సుద్దాలరాజు, చిరంజీవి, రాజు, ఖలీల్, తన్నీరు బాలరాజు, ఎర్రగోళ్ల ఎల్లయ్య, గెరిగింటి లక్ష్మయ్య, అల్లాడి ప్రభాకర్, చంద్రం, గొట్టం సత్తయ్య, కందుల చంద్రయ్య, చింతల భూపతి, గేరిగంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మల్లారెడ్డిపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
byJanavisiontv
-
0