గంభీరావుపేట్ ప్రతినిధి, ఏప్రిల్ 2 (జనవిజన్ న్యూస్)
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో జాతీయ ఉపాది హామీ పనులు చెస్తున్న కార్మికులకు ఎండవేడిమి నుంచి ఇబ్బందులు కలగకుండ ఓఆర్ఎస్ ప్యాకెట్ లు అందించారు. ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు బంటు విజయ్ అద్వర్యంలో కార్మికులకు మంచి నీరు, తదితర వసతులను పర్యవేక్షించారు. అనంతరం కార్మికులు ఎండదెబ్బ తగలకుండ ఉపాధి హామీ కార్మికులందరికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేసారు. కార్మికులు పనిచేసే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.