ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.
అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు ఖచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.
లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరి గణిస్తామన్నారు. కాగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెం ట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు HMలుగా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.