మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్ గౌతమి

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమి ఆలయ అధికారులతో కలసి గుడి చెరువు పార్కింగ్ ప్లేస్ ఆలయ ప్రాంగణము లో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పరిశీలించారు.

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యము, పటిష్టమైన క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వీరి వెంట ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఈ ఈ రాజేష్, మునిసిపల్ కమిషనర్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు ఎడ్ల శివ ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post