తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 28 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను మంగళవారం (ఫిబ్రవరి 20) ఇంటర్ బోర్డు విడుదల చేసింది.టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరిచారు. జూనియర్ కాలేజీల లాగిన్ ఐడీను నమోదు చేసి విద్యార్ధుల హాల్ టికెట్లను సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల..!
byJanavisiontv
-
0