కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు.. రూ.4,369 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం

కోస్గి: సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకరం చుట్టారు.ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గ రూపు రేఖలను పూర్తిగా మార్చేలా రూ.4,370 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి నారాయణపేట-కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. 

అదేవిధంగా రూ.213 కోట్లతో అప్రోచ్ రోడ్డు పనులు, రూ.3.99 కోట్లతో దుద్యాల మండలం హుస్నాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33.11 కేవీ సబ్ స్టేషన్, కోస్గి మండల కేంద్రంలో రూ.30 కోట్లతో నిర్మించనున్న ఇంజనీరింగ్ కళాశాల, రూ.11 కోట్లతో నిర్మించనున్న మహిళా డిగ్రీ కళాశాల, మద్దూరు మండల కేంద్రంలో 20 కోట్లతో నిర్మించనున్న బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కొడంగల్‌లో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, దుద్యాల మండలం హుస్నాబాద్ గ్రామంలో రూ.3.99 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 

ఆయా కార్యక్రమాల్లో ఆయనతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి, వర్ణిక రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post