మావోయిస్టు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి: గాజర్ల

భూపాలపల్లి జిల్ల, అక్టోబర్ 14 (జనవిజన్ న్యూస్): భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల అశోక్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004–05లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలలో అప్పటి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి పార్టీ తరుపున ప్రతినిధిగా పాల్గొన్నారు.

గాజర్ల అశోక్ అలియాస్ గణేష్. అప్పటికే ఆయన ఆంధ్ర–ఒడిశా బార్డర్‌ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే అప్పటి ప్రభుత్వ విధానాలతో పార్టీకి పొసగకపోవడంతో తిరిగి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే ప్రతిసారీ ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా గాజర్ల సోదరుల పేర్లు వినబడడం చిట్యాల ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి.

మెరుపుదాడులు చేయడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో ముగ్గురు గాజర్ల’ సోదరులు ఆరితేరిన వారుగా ఇప్పటికీ పార్టీలో, పోలీసు వర్గాలలో పేరుంది. కొద్దిరోజుల క్రితమే ఆరోగ్య కారణాలతో మావోయిస్టు పార్టీని వీడిన గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కీలకంగా మారింది.

సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక చేరడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Post a Comment

Previous Post Next Post