సిరిసిల్ల, 27 అక్టోబర్(జనవిజన్ న్యూస్): ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో తమ బలం నిరూపించుకునేందుకు కాంగ్రెస్ జిల్లా నాయకత్వం దృష్టి సారించింది. సిరిసిల్ల పట్టణంలో తమ ఓటు బ్యాంక్ ను పెంచుకునేందుకు నాయకత్వాన్ని పెంచుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ నియమిస్తున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, పట్టణ ప్రధాన కార్యదర్శిగా సర్దాపూర్ గ్రామానికి చెందిన గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ ను నియమించారు. ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రశాంత్ కు సూచించారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ లకు, పట్టణ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన ప్రశాంత్ ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ ప్రధాన కార్యదర్శిగా గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ నియామకం
byJanavisiontv
-
0